ఎక్కడ చూసినా పవన్ మేనియానే.. ఆ క్రేజే వేరప్పా!
on Sep 1, 2022

హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. సిల్వర్ స్క్రీన్ పై సింపుల్ వాక్ తో కూడా థియేటర్స్ దద్దరిల్లేలా చేయగల స్టార్డమ్ ఆయన సొంతం. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర ఉండే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఆయన ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం నటించిన సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ చేసినా థియేటర్స్ దగ్గర అదే రేంజ్ లో సందడి కనిపిస్తుండటం విశేషం.
పవన్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) కానుకగా 'తమ్ముడు', 'జల్సా' సినిమాల స్పెషల్ షోలను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. నిన్నటి నుంచే బర్త్ డే సందడి మొదలైంది. పలు థియేటర్స్ లో 'తమ్ముడు' స్పెషల్ షోలను ప్రదర్శించారు. దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం విశేషం. స్పెషల్ షోల సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈరోజు(సెప్టెంబర్ 1) థియేటర్స్ లో 'జల్సా' సినిమా స్పెషల్ షోల సందడి కనిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో మరే సినిమాకి జరగని విధంగా ఏకంగా 500కి పైగా స్పెషల్ షోలు వేయడం రికార్డు అని చెప్పొచ్చు. పైగా ఈ షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలోనే దాదాపు 75 స్పెషల్ షోలు వేస్తున్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రిలీజ్ అప్పుడు థియేటర్స్ దగ్గర ఫ్లెక్సీలు, కటౌట్ లు ఎలాగైతే కనిపిస్తాయో.. ఇప్పుడు స్పెషల్ షోస్ కి కూడా ఆ స్థాయి హంగామా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ స్పెషల్ షోల సందడి రేపు కూడా ఉండనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



