'కోబ్రా'కి 20 నిమిషాల కోత.. ఫలితం మారుతుందా?
on Sep 1, 2022

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కోబ్రా'. 'డిమోంటి కాలనీ' ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న(ఆగస్ట్ 31న) విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 3 గంటలకు పైగా ఉన్న నిడివి ఈ చిత్రానికి పెద్ద మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మూవీ టీమ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.
3 గంటలకు పైగా నిడివి ఉండి విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించగలిగే కంటెంట్ అందులో ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తుంది. కానీ 'కోబ్రా'లో అనవసరమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా ఉన్నాయి. కనీసం 20-30 నిమిషాలు ట్రిమ్ చేస్తే అవుట్ పుట్ కాస్త బెటర్ గా ఉండేదన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి కూడా వినిపించింది. ప్రేక్షకులు, విశ్లేషకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మేకర్స్ వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఈరోజు నుండి కొత్త వెర్షన్ ని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. మరి నిడివి తగ్గడంతో 'కోబ్రా' ఫలితం ఏమైనా మారుతుందేమో చూడాలి.

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన 'కోబ్రా'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



