మెగా మాస్ ట్రీట్.. పూనకాలు లోడింగ్!
on Dec 29, 2022

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరు, రవితేజల మాస్ ట్రీట్ ని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మాస్ ట్రీట్ ఎలా ఉండబోతుందో రేపు ప్రేక్షకులకు శాంపిల్ చూపించనుంది మూవీ టీమ్.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న 'వాల్తేరు వీరయ్య' నుంచి ఇప్పటికే విడుదలైన 'బాస్ పార్టీ', 'శ్రీదేవి చిరంజీవి', 'టైటిల్ థీమ్ సాంగ్' ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు 'పూనకాలు లోడింగ్' అంటూ మరో సాంగ్ అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సాంగ్ ని రేపు(డిసెంబర్ 30) విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ని వదిలారు. ఈ మాస్ సాంగ్ లో చిరంజీవి, రవితేజ కలిసి చిందేయనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కలర్ ఫుల్ పోస్టర్ లో మెగాస్టార్, మాస్ మహారాజా ను చూస్తుంటే ఇద్దరూ కలిసి తమ డ్యాన్స్ తో మెగా మాస్ ట్రీట్ ఇస్తారనిపిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



