ఈ యంగ్ హీరోయిన్ సామాన్యురాలు కాదు!
on Dec 29, 2022

టాలీవుడ్‌లో హీరోయిన్ కావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా అందర్నీ ఆకట్టుకునే తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ యంగ్ హీరోయిన్ శ్రీలీలలో పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఆమె మొదటిగా 'పెళ్లి సందడి' అనే సినిమాతో పరిచయమైంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరో. ఈ మూవీ కమర్షియల్ హిట్టయింది. దాంతో పాటు శ్రీలీల నటన, అందం, డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా రవితేజ వంటి సీనియర్ హీరో సరసన నటించిన 'ధమాకా' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. రవితేజ వయసులో సగం వయసు కూడా లేనప్పటికీ ఆ ఇద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. ఆమె డాన్సులకు థియేటర్లలో జనాలు లేచి డాన్సులు చేస్తున్నారు.
ప్రస్తుతం దర్జాగా ఆమె పలు చిత్రాలను ఒప్పుకోవడంలో బిజీ అయింది. వరుసగా రెండు సినిమాలు హిట్టవడంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. 'అనగనగా ఒక రోజు' అనే చిత్రంతో సహా 'జూనియర్' అనే తెలుగు, కన్నడ భాషల ద్విభాషా చిత్రం ఆమె చేస్తోంది. ఇక ఈ అమ్మడి జాబితా చూస్తే ఈ బ్యూటీ సీనియర్ హీరోల నుండి జూనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతోంది.
బాలయ్య- అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రానున్న బాలయ్య 108వ చిత్రంలో ఈ భామ ఓ కీకల పాత్రకు ఎంపికైంది. అలాగే రామ్ పోతినేని- బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో ఈ భామను నాయికగా ఎంచుకున్నారు. ఇక ఈమె వారాహి బ్యానర్ వారికి కూడా ఓ సినిమా కమిట్ అయింది. మెగా మేనల్లుడు, ఉప్పెన ఫేమ్ వైష్ణవ తేజ్‌తో మరో సినిమా చేస్తోంది. అంతేనా యూత్ స్టార్ నితిన్ తో ఒక సినిమా, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మరో సినిమా చేస్తోంది. మొత్తానికి అవకాశాలు సంపాదించడం ఎలా? దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం ఎలా? పదేళ్లపాటు సరిపడా సంపాదించడం ఎలా?.. అనే విషయాలను ఈ యంగ్ హీరోయిన్ ని చూసి మిగిలినవారు నేర్చుకుంటే బాగుంటుందని కొందరు జోకులు పేలుస్తున్నారు..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



