ముంబైలో వాక్సిన్ వేయించుకున్న పూజ!
on Jul 22, 2021
సినిమా షూటింగ్‌లను కొనసాగించడానికి ముందు కొవిడ్-19 వాక్సిన్ వేయించుకుంది అందాల తార పూజా హెగ్డే. వాక్సినేషన్ సెంటర్లో వాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆమె షేర్ చేసుకుంది. మొదటి ఫొటోలో లీలావతి హాస్పిటల్‌కు చెందిన వాక్సినేషన్ సెంటర్లో వాక్సిన్ వేయించుకుంటున్న పూజాతో పాటు వాళ్లమ్మ లత కూడా ఉన్నారు. ఆ ఫొటోకు, "Jabbed! The last time @latamhegde took me to go get vaccinated I was probably 2 #theworldwelivein" అనే క్యాప్షన్ జోడించింది.
రెండో ఫొటోలో వాక్సిన్ వేయించుకుంటున్నప్పుడు పూజా అందమైన రియాక్షన్‌ను చూడొచ్చు. ఆ టైమ్‌లో వాళ్లమ్మ చేతిని గట్టిగా పట్టుకొని, మాస్క్ వెనుక నవ్వుతూ కనిపిస్తోంది. దానికి, "When your hiding your fear with your smile. " అని రాసుకొచ్చింది పూజ. మింట్ గ్రీన్ టాప్, బ్లూ జీన్స్ ధరించి గార్జియస్‌గా కనిపిస్తోందామె. మెడలో సన్నని నెక్లెస్, చేతిలో బ్రౌన్ కలర్ హ్యాండ్‌బ్యాగ్‌తో, జుట్టును ఓపెన్‌గా వదిలేసి సింపుల్‌గానే బ్యూటిఫుల్‌గా ఉంది.
సినిమాల విషయానికి వస్తే, త్వరలో ఆమె అఖిల్ జోడీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్' మూవీలోనూ, రణవీర్ సింగ్ సరసన 'సర్కస్' సినిమాలోనూ కనిపించనున్నది. అలాగే రామ్‌చరణ్ జోడీగా 'ఆచార్య'లో, విజయ్‌తో 'బీస్ట్'లో ఆమె నటిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో 'భాయీజాన్' అనే సినిమా చేస్తోంది.
Also Read