శ్రీదేవిలా నిహారిక... చిరంజీవిలా ఆమె భర్త!
on Jul 23, 2021
నిహారిక కొణిదెల 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో శ్రీదేవిలా ముస్తాబయ్యారు. దేవకన్యలా మెగా డాటర్ గెటప్ బాగుంది. కాకపోతే ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించారు. ఆమె భర్త వెంకటచైతన్య జొన్నలగడ్డ ఏమో 'బావగారూ బాగున్నారా'లో చిరంజీవిలా మారారు. చెక్ ప్యాంటు, వైట్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్, దానిపై కోటు... సేమ్ టు సేమ్ చిరంజీవిలా ఉన్నాడని చెప్పలేం. కానీ, పర్లేదు. ట్రై చేశారు. ఇదంతా ప్రణీత్ బ్రహ్మాండపల్లి పుట్టినరోజు పార్టీ కోసం! ప్రణీత్ బ్రహ్మాండపల్లి, నిహారికా కొణిదెల బెస్ట్ ఫ్రెండ్స్. అతడి పుట్టినరోజుకు అందరూ రెట్రో స్టయిల్ లో రెడీ అయ్యి వచ్చారు.
రాహుల్ విజయ్, నిహారిక జంటగా నటించిన 'సూర్యకాంతం' సినిమాకు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. అంతకు ముందు నిహారికతో వెబ్ సిరీస్ లు చేశారు. వీళ్ళ బ్యాచ్ లో ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ కూడా ఉన్నారు. ఆయన 'క్షణ క్షణం'లో వెంకటేష్ గెటప్ వేశారు.
బర్త్ డే బాయ్ ప్రణీత్ 'కూలి నంబర్ 1'లో వెంకటేష్ టైపులో రెడ్ షార్ట్, ఖాకి ప్యాంటు వేసుకుని వచ్చారు. రెట్రో స్టయిల్ పార్టీలో ఒక్కొక్కరూ ఒక్కోలా రెడీ అయ్యారు. మొత్తం మీద భర్తకు సినిమా వాతావరణాన్ని అలవాటు చేస్తోందని నిహారిక గురించి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉండటం విశేషం.
Also Read