ప్రభాస్ మంచితనానికి పూజా హెగ్డే తల్లి ఫిదా!
on Mar 7, 2022

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన పూజా హెగ్డే పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రభాస్ మంచితనం చూసి తన తల్లి సంతోషం వ్యక్తం చేశారని తెలిపింది.
* 'రాధేశ్యామ్'లో నా పాత్ర పేరు ప్రేరణ. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. డిఫరెంట్ షేడ్స్, డెప్త్, ఎమోషన్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు చదివాను. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని ఉంది.
* జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టర్. ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేస్తాడు. అల్లు అర్జున్ కూడా ఎనర్జిటిక్ యాక్టర్. ప్రభాస్ విషయానికి వస్తే.. ఆయనకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ ఒక్కసారి కలిసిపోతే చాలా సరదాగా ఉంటాడు. ఇటలీలో షూటింగ్ సమయంలో టీమ్ సభ్యులలో కొందరు కరోనా బారిన పడినప్పుడు, ప్రభాస్ వారందరికీ ఆహారం పంపేవాడు. ప్రభాస్ లోని మంచితనాన్ని చూసి మా అమ్మ చాలా సంతోషపడింది.
* 'రాధేశ్యామ్'ని టైటానిక్ తో పోలుస్తున్నారు. కానీ రాధేశ్యామ్ టైటానిక్ కాదు. ఓడ మాత్రమే రెండింటిలోనూ కామన్.
* ప్రేమించే తీరిక లేదు. సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది.
* 'ఆచార్య', 'బీస్ట్' సినిమాలతోనూ త్వరలో ప్రేక్షకులను పలకరిస్తాను. మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో, పవన్ కళ్యాణ్ సరసన 'భవదీయుడు భగత్ సింగ్'లో నటిస్తున్నాను.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



