అఖిల్ 'ఏజెంట్' అప్డేట్.. పవర్ ఫుల్ లుక్ లో మమ్ముట్టి
on Mar 7, 2022

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు.
'ఏజెంట్' షూటింగ్ లో మమ్ముట్టి పాల్గొంటున్నారని తెలియజేస్తూ మూవీ టీమ్ తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది. చేతిలో గన్ పట్టుకొని మమ్ముట్టి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. 'THE DEVIL RUTHLESS SAVIOUR' అని పోస్టర్ పై రాసుకొచ్చారు. చివరిసారిలాగా తెలుగు 'యాత్ర(2019)' సినిమాతో ఆకట్టుకున్న మమ్ముట్టి ఈ సినిమాలో ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'ఏజెంట్' పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



