ఇండస్ట్రీ హిట్ `ఒసేయ్.. రాములమ్మా!`కి పాతికేళ్ళు!
on Mar 7, 2022

తెలుగునాట `ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్` అనే మాట వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అలాంటి విజయశాంతి నాయికగా నటించిన సెన్సేషనల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో `ఒసేయ్.. రాములమ్మా!` ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాలో.. దొరల లైంగిక వాంఛకు బలై తిరుగుబాటు బాట పట్టే రాములమ్మ పాత్రలో అలరించారు విజయశాంతి. అలాగే, తన అద్భుత అభినయంతో `ఉత్తమ నటి`గా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
Also Read: ప్రభాస్ కి మరోసారి ప్లస్ అవుతాడా!?
సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో దర్శనమిచ్చిన ఈ సినిమాలో దాసరి నారాయణ రావు, రామిరెడ్డి, అశోక్ కుమార్, రాంకీ, నర్రా వెంకటేశ్వరరావు, శకుంతల, సుత్తి వేలు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. `వందేమాతరం` శ్రీనివాస్ బాణీలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ``ఒసేయ్.. రాములమ్మా!``, ``రామసక్కని తల్లి``, ``రాములమ్మ ఓ రాములమ్మ``, ``లచ్చులో లచ్చన్నా``, ``అడ్డాలోరి బుడ్డయ్య``, ``పుల్లల మంటివి``, ``ఏ అసురుడు``, ``ఎరుపు రంగు``, ``ఓ చౌదరి గారూ``, ``ఇంతి ఏ ఇంటి జాణవే``.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. ఈ సినిమాతో `ఉత్తమ సంగీత దర్శకుడు`గా `వందేమాతరం` శ్రీనివాస్ కూడా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకోవడం విశేషం. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ పతాకంపై నిర్మితమైన `ఒసేయ్.. రాములమ్మా!` 1997 మార్చి 7న విడుదలై.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



