విజె సన్నీ పై దాడి
on Jun 9, 2022

విజె సన్నీ ఈ పేరు ఇప్పుడెంతో పాపులర్. బిగ్ బాస్ సీజన్ 5 విజేత. తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాడు కూడా. ఐతే ఇప్పుడు అనుకోని సంఘటన జరిగింది. హస్తినాపురంలో మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సన్నీ పై ఒక రౌడీ షీటర్ దాడి చేయడానికి ప్రయత్నించేసరికి అక్కడ ఉన్న సిబ్బంది షూటింగ్ లొకేషన్ నుంచి సన్నీని తీసుకెళ్ళిపోయి పోలీస్ లకు సమాచారం అందించారు. పోలీసులు రౌడీ షీటర్ ని అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ విన్నర్ అయ్యాక మూవీస్ చేయడానికి సైన్ చేసాడు. హీరోగా సకల గుణాభి రామ అనే మూవీలో, ఇంకా డైమండ్ రత్నబాబు నిర్మిస్తున్న ఇంకో మూవీలో చేస్తున్నాడు. ఐతే రౌడీ షీటర్ కి సన్నీ కి మధ్య ఎం జరిగిందో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



