పోసానిపై పోలీసు కేసు..
on Oct 3, 2023
పోసాని కృష్ణ మురళికి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన పోసాని ఆ తర్వాత దర్శకుడుగా,నటుడుగా ఒక రేంజ్ లో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మురళి పై పోలీస్ కేసు నమోదు చెయ్యమని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.
ఒకప్పటి పోసాని వేరు ఇప్పటి పోసాని వేరు అనేలా ప్రస్తుతం పోసాని తీరు ఉంది.ఒకప్పుడు తన పెన్ను మాత్రమే మాట్లాడేది ఇప్పుడు ఆయన నోరు మాత్రమే మాట్లాడుతుంది. కొన్న్ని రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోసాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీంతో రాజమండ్రి కి చెందిన పవన్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో పోసాని తమ నాయకుడి పై నిరాధార ఆరోపణలు చేసాడని చెప్పి పోసాని పై పోలీసు కేసు నమోదు చేసేటందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ లు కేసు స్వీకరించలేదు. దీంతో జనసేన నాయకులు కోర్ట్ ని ఆశ్రయించడంతో పోసాని మీద కేసు నమోదు చెయ్యవలసిందిగా కోర్ట్ పోలీసులని ఆదేశించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
