'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్.. ఈ దసరా మాస్ రాజాదే!
on Oct 3, 2023
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇది రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ మంగళవారం మధ్యాహ్నం విడుదలైంది. "గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట పాతిక వేలు" అంటూ దొంగతనాలు చేసుకోవడానికి వేలంపాట పాడుతున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. "పోలీసులకు విజ్ఞప్తి. కాకినాడ నుంచి మద్రాస్ వెళ్ళు సర్కార్ ఎక్స్ ప్రెస్.. దారిలో దోపిడీకి గురి కాబోతుంది" అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ దొంగతనం చేసే పవర్ ఫుల్ దొంగగా రవితేజ పోషించిన నాగేశ్వరరావు పాత్రను చూపించారు. "కొట్టే ముందు, కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు" అనే డైలాగ్ కూడా ఆ పాత్ర తీరుని తెలియజేస్తోంది. స్టూవర్టుపురం నాగేశ్వరరావు 'టైగర్ నాగేశ్వరరావు'గా ఎలా మారాడు? ఓ పోలీస్ అధికారి అతన్ని చంపడమే లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నాడు? టైగర్ నాగేశ్వరరావు ఏకంగా పీఎం సెక్యూరిటీకే ముప్పుగా ఎలా మారాడు? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్స్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఇక రవితేజ అయితే టైగర్ నాగేశ్వరరావు పాత్రలో చెలరేగిపోయాడని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తుంటే మాస్ రాజా పాన్ ఇండియా రేంజ్ లో తన తడాఖా చూపించేలా ఉన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
