ఆ 100 కోట్ల సినిమాలో శ్రీలీలే హీరోయిన్!
on Oct 3, 2023
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ హీరోయిన్ విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కి ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెక్ పెట్టాడు.
విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఖుషి పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తన ఇమేజ్ ని కాపాడుకోవాలనే పట్టుదలతో నాని కి జెర్సీ లాంటి హిట్ మూవీ ని అందించిన గౌతమ్ దర్శకత్వం లో సినిమాని చేస్తున్నాడు.ఈ మూవీ లో మొదట హీరోయిన్ గా అందాల భామ శ్రీలీల ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత శ్రీలీల ప్లేస్ లో రష్మిక వచ్చిందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వచ్చాయి. ఆ వార్తలతో శ్రీలీల అభిమానులు షాక్ కి గురయ్యారు. దీంతో చిత్ర నిర్మాత నాగవంశీ రంగంలో కి దిగి తన సినిమా హీరోయిన్ శ్రీ లీలే అని ఫుల్ క్లారిటీ ని ఇచ్చాడు. నిర్మాత ఇచ్చిన క్లారిటీ తో శ్రీ లీల అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.దేవరకొండ అండ్ శ్రీ లీల సినీ కెరియర్ లోనే సుమారు 100 కోట్ల బడ్జెక్టు తో రూపొందుతున్న ఈ క్రేజి ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
