"జనతా" ప్రభంజనంలోనూ ఉతికారేస్తోంది..!
on Sep 16, 2016

ఇదివరకటి రోజుల్లో సినిమా సక్సెస్ అంటే ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్కలతో నడిచేది..కానీ ప్రస్తుతం ఆ లెక్కలు మారిపోయి వసూళ్లను బట్టి హిట్టు అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లిచూపులు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా..కేవలం కథను నమ్ముకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్‌సీస్‌లోనూ దుమ్ములేపుతోంది. ఈ సినిమా వచ్చిన టైంలో మరే సినిమా పోటీరాకపోవడంతో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని వసూళ్లు రాబట్టింది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రిలీజై అంచనాలకు మించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. జనతా ప్రభంజనం మహోగ్రరూపం దాల్చడంతో పెళ్లిచూపులు సైడ్ అవుతుందనుకున్నారు. కానీ, పెళ్లిచూపులు ఆడియాన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ స్టడీగా కలెక్షన్లు కుమ్మేస్తోంది. 80 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 35 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నిర్మాతలకు, బయ్యర్లకు, డిస్ట్రీబ్యూటర్లకు లాభాల పంట పండించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



