ఆయనపై నాదే హక్కు..!
on Sep 16, 2016

విడిపోయారన్న మాటే కానీ..పవన్‌పై రేణు, రేణుపై పవన్ చూపించే ప్రేమకు ఆకాశమే హద్దు. ఎన్నో సందర్భాల్లో రేణుదేశాయ్ దొరకడం తన అదృష్టం అని చెప్పేవారు పవన్. అలాగే రేణు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చూడలేదంటూ ఇలా ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తపరిచేవారు. ఈ మధ్యకాలంలో పవర్‌స్టార్ ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో అభిమానులతో పంచుకున్నారు రేణు దేశాయ్. అయితే దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వచ్చాయి. విడిపోయి..విడిగా ఉంటున్నపుడు ఆమెకు పవన్ గురించి మాట్లాడటం అవసరమా..పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన రేణు దేశాయ్ ఆ కామెంట్లకు సమాధానంగా తన ఇంటర్వ్యూని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నేనేమీ పవన్‌ను కాకా పట్టడం లేదు, 17 సంవత్సరాలుగా నేను ఆయనకి బెస్ట్ ఫ్రెండ్‌ని, పైగా 11 ఏళ్లు ఆయనతో కలిసి జీవించాను. ఇద్దరు పిల్లలకు తండ్రి ఆయన. మీ అందరూ పవన్ గారి ఫోటోలు పెట్టుకోవచ్చు, నేను మాత్రం ఆయన గురించి మాట్లాడకూడదా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే మీ అందరికంటే నాకే ఆయనపై హక్కు ఎక్కువ అని ..ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తాను పవన్ ఫోటోలను పోస్ట్ చేయడం మాననని స్పష్టం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



