సత్యదేవ్ కి జోడీగా పాయల్ రాజ్ పుత్?
on Jan 5, 2021

బ్లఫ్ మాస్టర్ తరువాత టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గాడ్సే. బ్లఫ్ మాస్టర్ తరహాలోనే గాడ్సేలోనూ సత్యదేవ్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లో దర్శనమివ్వనున్నాడని టాక్. కాగా, ఇందులో కథానాయికగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేశారని వినిపిస్తోంది. అంతేకాదు.. హీరో పాత్రలాగే హీరోయిన్ పాత్రలో కూడా వ్యతిరేక ఛాయలుంటాయని తెలిసింది. త్వరలోనే గాడ్సే లో పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సత్యదేవ్.. తిమ్మరసు, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ పొంతనలేని పాత్రల్లోనే దర్శనమివ్వనున్నాడు. ఇక పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే.. 5Ws చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీర్ గానూ, జయంత్ రూపొందిస్తున్న నరేంద్రలో కీలక పాత్రలోనూ నటిస్తోంది.
మరి.. బ్లఫ్ మాస్టర్ తో ఆశించిన విజయం అందుకోలేకపోయిన సత్యదేవ్, గోపీ గణేష్.. గాడ్సే తో ఆ ముచ్చటని తీర్చుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



