"రాత్రికి రేటెంత?" అనడిగిన నెటిజన్.. వైరల్ అయిన నటి ఆన్సర్!
on Jan 5, 2021

మానసికంగా కొంతమంది మనుషులు దిగజారుడు స్థితి నుంచి బయటపడరని సోషల్ మీడియా ద్వారా వాళ్లు చేసే కామెంట్స్‌తో మనకు తరచూ తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకించి లేడీ ఆర్టిస్టుల విషయంలో కొంతమంది నెటిజన్లు తమ నీచ మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటూ వస్తుంటారు. కమల్ హాసన్ మూవీ 'దేవర్ మగన్'తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో అడుగుపెట్టి ఆకట్టుకున్నారు నీలిమా రాణి.
ప్రియసఖి, తిమిరు, మోళి, సంతోష్ సుబ్రమణియమ్, రాజాధి రాజా, నాన్ మహాన్ అల్ల, గజినీకాంత్, శత్రు తదితర చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్‌తో కోలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాగే దక్షిణాది భాషలన్నింటిలోనూ టీవీ సీరియల్స్‌లో నటించి వీక్షకులకు దగ్గరయ్యారు. మా టీవీలో ప్రసారమైన 'తాళికట్టు శుభవేళ' సీరియల్‌లో హీరోయిన్ అవనిగా నటించి తెలుగు వీక్షకులను ఆకట్టుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నీలిమా రాణి లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన ఫాలోయర్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ నిర్వహించారు. వారిలో ఒక ఫాలోయర్ "రాత్రికి ఎంత తీసుకుంటారు?" అంటూ అడిగాడు. అతనికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పి, నోరు మూయించారు నీలిమ. "బ్రదర్.. కొంత హుందాతనం ఆశిస్తున్నా!! దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక! ప్రజలను వేధించడం అనేది పర్వర్ట్ మైండ్ వాళ్లు చేసేపని. ఓ సైకాలజిస్ట్‌ని కలవండి ప్లీజ్. మీకు సాయం అవసరం." అని ఆమె ఆన్సర్ ఇచ్చారు. నెటిజన్ అడిగిన చెత్త ప్రశ్నకు నీలిమ ఇచ్చిన ఈ ఘాటు సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



