పవన్ అభిమానులకు గుడ్ న్యూస్....
on Aug 24, 2017
మొన్న చిరంజీవి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు కావడం.. ఇక అదే రోజున చిరు కొత్త సినిమా.. "సైరా నరసింహారెడ్టి" కి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వడంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. పవన్ 25 వి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ పుట్టిన రోజు కానుకగా లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయన్ని కూడా ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.