పవన్ కల్యాణ్-క్రిష్ మూవీ టైటిల్ అదేనా?
on Mar 4, 2020

ఒకవైపు దిల్ రాజు ప్రొడక్షన్‌లో 'వకీల్ సాబ్' సినిమా చేస్తోన్న పవన్ కల్యాణ్, మరోవైపు క్రిష్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్న విషయం విదితమే. పీరియడ్ మూవీగా తయారవుతున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ చేస్తున్నాడు. మొదట్లో హీరోగా నటించి, తర్వాత విలన్ పాత్రల్లో రాణిస్తూ వస్తోన్న రాంపాల్ ఈ మూవీలో చేస్తోంది కూడా నెగటివ్ రోలేనని సమాచారం. హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 'సాహో'లో ఒక పాటలో ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ను ఒక పాత్ర కోసం క్రిష్ సంప్రదించాడనేది బాలీవుడ్ వర్గాల సమాచారం. మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు.
కాగా ఈ మూవీకి 'వారాహి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కథకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో క్రిష్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆ టైటిల్‌ను నిర్మాత ఎ.ఎం. రత్నం రిజిస్టర్ చేయించారు కూడా. కానీ పవన్ కల్యాణ్ ఆ టైటిల్‌కు అంత సుముఖంగా లేరని వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తయారవుతున్న ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబరులో విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని రత్నం భావిస్తున్నారు. అయితే పొలిటికల్ కమిట్‌మెంట్స్ కూడా ఉన్న పవన్ కల్యాణ్‌తో అంత త్వరగా సినిమా పూర్తవడం కష్టమే. అప్పటికి సినిమా సిద్ధం కాకపోతే 2021 వేసవికి సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



