డిజిటల్‌లో కాదు... థియేటర్లలో చూడమంటున్నాడు!
on Mar 4, 2020
.jpg)
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, సోనీ లివ్ వంటి డిజిటల్, ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చి ప్రతి సినిమా చూసే ప్రేక్షకులు తగ్గారు. ఏదో కొద్ది మంది మాత్రమే అన్ని సినిమాలను చూస్తున్నారు. మిగతావాళ్లు అమెజాన్‌లోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో వస్తే చూద్దామని అనుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణి సినిమాలపై ఏ రేంజ్‌లో ఎఫెక్ట్ చూపిస్తుందనేదానికి ‘కనులు కనులను దోచాయంటే’ సక్సెస్ మీట్‌లో దుల్కర్ సల్మాన్ స్పీచ్ ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు.
తమిళంలో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన ఒక సినిమా తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ మౌత్ టాక్ కూడా బాగుంది. థియేటర్లకు డీసెంట్ రేంజ్‌లో ఆడియన్స్ వస్తున్నారు. అలాగని, సూపర్‌హిట్ కలెక్షన్స్ రావడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడం ఒక రీజన్ అనుకోవాలి. బుధవారం జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘థియేటర్లలో చూసిన వాళ్లందరికీ సినిమా నచ్చింది. ఇది ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో చూసే సినిమా కాదు. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. నేను సింగిల్‌గా చూశా. తర్వాత థియేటర్లలో సినిమా చూశా. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరు. డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయకండి. థియేటర్లలో సినిమా చూడండి’’ అని రిక్వెస్ట్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



