కార్తికేయ సో స్మార్ట్.. 'బస్తీ బాలరాజు' టైటిల్ రిజిస్టర్ చేయించాడు!
on Mar 4, 2020
.jpg)
నిజమే కదా.. 'చావు కబురు చల్లగా' మూవీలో కార్తికేయ చేస్తున్న పాత్ర పేరు బస్తీ బాలరాజు అని ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా.. అందులో కొత్తేముంది?.. అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అల్ల అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తయారవుతున్న 'చావుకబురు చల్లగా' మూవీలో బస్తీ బాలరాజు అనే పాత్ర చేస్తున్న కార్తికేయ.. లేటెస్టుగా తన సొంత నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై 'బస్తీ బాలరాజు' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. అదీ సంగతి! దాన్నిబట్టి మనోడు ఎంత స్మార్టో అర్థమైపోతోంది కదూ!
ఇటీవల 'చావు కబురు చల్లగా' మూవీలో కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అతడి క్యారెక్టర్ పేరుకు అంతకు మించి ఆదరణ లభించింది. దాంతో ఇంకెవరైనా ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేస్తారేమోనని ఊహించిన కార్తికేయ, ఫాస్ట్‌గా రెస్పాండయి, ఫిలించాంబర్‌లో ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. అయితే ఆ టైటిల్‌తో అతను ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాల్సిందే. కాగా 'చావు కబురు చల్లగా' మూవీలో అతడి జోడీగా లావణ్యా త్రిపాఠి నటిస్తోంది. చనిపోయినవారిని 'స్వర్గపురి వాహనం'లో శ్మశానానికి చేరవేసే బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



