‘పవన్ కళ్యాణ్ నా ఫస్ట్ లవ్’ అంటున్న అషు
on Jul 12, 2022

అషురెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు పెడుతూ ఆడియన్స్ దృష్టిని తన వైపు ట్యూన్ చేసుకుని చూసేలా మాయ చేస్తోంది. ఇటీవల నడుము మీద పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేసుకున్న ఫోటో పెట్టి రచ్చ చేసింది.. ఫ్రెండ్స్ తో మందు కొడుతూ సముద్రం ఒడ్డున పరిగెడుతూ కనిపించింది.. బాత్ టబ్ లో పడుకుని హుషారెత్తించింది. ఒకటా రెండా అషు వేషాలు చెప్పలేనన్ని.. ఇక పీకే గురించి చెప్పక్కర్లేదు.. పవన్ కల్యాణ్ అనే పదంలోనే ఒక మత్తుంది అంటూ ఒక మూవీలో డైలాగ్ కూడా ఉంది. నిజంగా పవన్ పేరుని ఎంతో మంది స్మరిస్తూ నిత్యం తలచుకుంటూ ఉంటారు. చెప్పాలంటే ఆయన అభిమానులకు అంతే లేదు. పవన్ కల్యాణ్ ని మూగగా ప్రేమించేవాళ్లకు లెక్కే లేదు. అతన్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉండడమే వాళ్ళ తిక్క.
ఇప్పుడు అషు రెడ్డి వంతు వచ్చింది. పవన్ కల్యాణ్‌ని ప్రేమిస్తున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టేటస్ పవన్ క్యూట్ ఇమేజ్ పిక్స్ పెట్టి మరీ పోస్ట్ చేసుకుంది. "మై ఫస్ట్ ఫస్ట్ లవ్, మై గాడ్, పవనిజం" అంటూ తన మనసులోని ప్రేమను హాష్ టాగ్స్ పెట్టేసి మరీ స్టేటస్ పెట్టుకుంది. అంతే కాదు "నేను నిన్ను అప్పుడూ ప్రేమించాను, ఇప్పుడూ ప్రేమిస్తున్నా, ఎప్పటికీ చాలా ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటా" అంటూ పవన్ మీద ప్రేమను బయటపెట్టింది అషు. ఇక ఆమె ఇటీవల అర్జున్‌రెడ్డితో కూడా మాట్లాడింది. ఆ ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే ఇద్దరి మధ్య ఏం కాన్వర్జేషన్ జరిగిందో తెలీదు. అషు కూడా ఆ విషయాలేవీ బయటికి చెప్పలేదు. నెటిజన్స్ మాత్రం 'లైగర్'తో అసలేం మాట్లాడి ఉంటుంది అంటూ ఆరా తీస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



