కన్ను మూసిన ఆత్రేయ సతీమణి..!
on Apr 22, 2016

మనసు కవిగా విరహ గీతాల ఆవిష్కర్తగా, ఎన్నో వందల పాటలకు ప్రాణ ప్రతిష్ట చేశారు ఆచార్య ఆత్రేయ. ఆయనతో పాటు ఆయన జీవన సహచరిగా పద్మావతి కూడా ఆత్రేయ అభిమానులకు సుపరిచితం. 90 ఏళ్ల వయస్సులో ఆరోగ్యంగా జీవిస్తున్న ఆమె, శుక్రవారం నాడు సహజ మరణం చెందారు. ఆత్రేయకు చేదోడు వాదోడుగా, జీవన సహచరిగా పద్మావతి జీవించారు. ఆయన గతించిన తర్వాత కూడా తమది ఎంత బలమైన బంధమో ఆమె అనేక ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముదునూరుపాడులో, తన సోదరి నివాసంలో ఆమె కన్ను మూశారు. వీరి స్వస్థలం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. ఆమె మరణం పట్ల ఆచార్య ఆత్రేయ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



