'భీమ్లా నాయక్' ట్రైలర్‌పై ఫ్యాన్స్ గుస్సా.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా!
on Feb 22, 2022

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ నిన్న రాత్రి 9 గంటలకు యూట్యూబ్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. అప్పట్నుంచీ పవన్ అభిమానులు ఆ ట్రైలర్‌పై తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్నారు. వారిలో అనేకమంది ట్రైలర్‌పై తమ అసంతృప్తిని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే భీమ్లా నాయక్ క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు టైటిల్ రోల్‌లో పవన్ అప్పీరెన్స్, ఆయన డైలాగ్స్ అదిరిపోయాయనే అభిప్రాయం వ్యక్తమైంది. తమన సంగీతం సమకూర్చిన సాంగ్స్ కూడా సూపర్ పాపులర్ అవడంతో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతుందనే ప్రకటన నిర్మాతల నుంచి వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నిన్న అనుకోని కారణాలతో ప్రి రిలీజ్ ఈవెంట్ కాన్సిల్ కావడంతో డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్, ట్రైలర్ ఒక గంట ఆలస్యంగా రిలీజైనప్పటికీ ఆనందపడ్డారు. కానీ ఆ ట్రైలర్‌ను ఎడిట్ చేసిన తీరు చాలామందిని నిరాశకూ, అసంతృప్తికీ గురిచేసింది. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ, అన్ని విషయాల్లో తానే ముందుండి నడిపిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ట్రైలర్ కూడా ఆయన కనుసన్నల్లోనే ఎడిట్ చేసివుంటారనేది బహిరంగ రహస్యమే.
ఫ్యాన్స్‌లో చాలామంది ట్రైలర్ ఎడిటింగ్ ఏమీ బాగాలేదనీ, సినిమా ట్రైలర్‌లా ఉండదని ఆశిస్తున్నామనీ కామెంట్లు పెట్టారు. ఒక అభిమాని "ఎక్స్‌పెక్ట్ చేసినట్లు కాకుండా ట్రైలర్ చాలా బ్యాడ్‌గా ఉంది. తమన్ బీజియం ఆయన మార్క్‌కు రీచ్ కాలేదు. వెరీ డిజప్పాయింటెడ్" అని అభిప్రాయపడ్డాడు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఇంత వరస్ట్ ట్రైలర్ చూడలేదని ఇంకొకతను కామెంట్ చేశాడు. నెరేషన్ స్లోగా ఉందనీ, సీన్స్ చాలా పూర్‌గా ఉన్నాయనీ, లొకేషన్స్ వరస్ట్‌గా ఉన్నాయనీ, డైరెక్షన్ బ్యాడ్‌గా ఉందనీ రాసుకొచ్చాడు. ఇంకో అభిమాని, ట్రైలర్‌ను ఎలా కట్ చెయ్యాలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు కంపెనీ)ని చూసి నేర్చుకోమనీ, ఇప్పటికీ 'వకీల్‌సాబ్' ట్రైలర్ బెస్ట్ కట్ అనీ కామెంట్ చేశాడు.
ఏదేమైనా పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లు ఆయన క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసే విధంగా కట్ చెయ్యలేదనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. "నీ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పొగర్రా" అని రావు రమేశ్ అన్నప్పుడు పవన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, అక్కడ వాడిన బీజియం కానీ ఎఫెక్టివ్‌గా లేవని చెప్పాలి. కొంతమంది ఫ్యాన్స్ అయితే ట్రైలర్‌లో రానా హీరోలా కనిపిస్తున్నాడని కూడా కామెంట్లు పెట్టారు. రామ్‌గోపాల్ వర్మ సైతం భీమ్లా నాయక్ ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ ట్రైలర్‌గా ఉన్నాడనీ, రానా దగ్గుబాటి ఫిల్మ్‌లా ఉన్నాడనీ ట్వీట్ చేయడం గమనించాల్సిన విషయం. సో.. అల్టిమేట్‌గా ఫ్యాన్స్ ఊహలకు భిన్నంగా ట్రైలర్ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



