రానా తమ్ముడు అభిరామ్ అ'హింస'తో భయపెడుతున్నాడు
on Feb 22, 2022

దగ్గుబాటి యువ హీరోల సందడి మొదలైంది. ఓ వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రికార్డు వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి తన డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ తో తాజాగా ప్రేక్షకులను పలకరించాడు.
ఉదయ్ కిరణ్, నితిన్ వంటి హీరోలను సక్సెస్ ఫుల్ సినిమాలతో టాలీవుడ్ కి పరిచయడం చేసిన డైరెక్టర్ తేజ.. దగ్గుబాటి హీరో అభిరామ్ మొదటి సినిమాకి దర్శకత్వం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ మూవీకి అహింస అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది మూవీ టీమ్. టైటిల్ లో అహింస ఉన్నప్పటికీ, పోస్టర్ లో మాత్రం హింస కనిపిస్తోంది. అభిరామ్ కళ్ళు కనపడకుండా తలకి గోనె సంచి చుట్టి, ఎవరో బలంగా కొట్టినట్లు ఉంది. ఓ వైపు అహింస టైటిల్, మరోవైపు నెత్తుటి ధారతో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఇక ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించడం విశేషం. తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. వాటిలో ఉదయ్ కిరణ్, నితిన్ డెబ్యూ సినిమాలు చిత్రం, జయం కూడా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత అభిరామ్ సినిమా కోసం మళ్ళీ ఆర్పీని రంగంలోకి దింపాడు తేజ. ఉదయ్ కిరణ్, నితిన్ లాగే అభిరామ్ కి తేజ, ఆర్పీ కాంబోలో డెబ్యూ ఫిల్మ్ కలిసి వస్తుందేమో చూడాలి. అలాగే రానాకి 'నేనే రాజు నేనే మంత్రి'తో సూపర్ హిట్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు అభిరామ్ తో కూడా హిట్ అందుకొని దగ్గుబాటి హీరోల లక్కీ దర్శకుడిగా మారతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



