పవర్ స్టార్ కి కాస్త ముందుగానే 'బాస్ పార్టీ'
on Nov 22, 2022

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' నుంచి 'బాస్ పార్టీ' సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోవడం, చిరు వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో.. రేపు(నవంబర్ 23) సాయంత్రం 4:05కి విడుదలయ్యే ఈ సాంగ్ పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఫ్యాన్స్ కంటే ముందే ఈ సాంగ్ లిరికల్ వీడియోని సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చూపించాడు మెగాస్టార్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ 'బాస్ పార్టీ' రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో అన్నయ్యతో కలిసి 'బాస్ పార్టీ' సాంగ్ పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకుంది మైత్రి. అందులో పవన్ సాంగ్ తిలకిస్తుండగా చిరు చాలా సంతోషంగా తమ్ముడి వైపు చూస్తున్నాడు. ఫోటోలలో మెగాస్టార్ చాలా యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆ ఫొటోల్లో చిరు, పవన్ తో పాటు బాబీ, డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. క్రిష్ ప్రస్తుతం పవన్ తో 'హరి హర వీరమల్లు' చేస్తున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



