ఆగని కలెక్షన్ల వేట.. 400 కోట్ల క్లబ్ లో 'కాంతార'
on Nov 22, 2022

కన్నడ చిత్రం 'కాంతార' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన 'కాంతార'.. ఆ తర్వాత రెండు వారాలకు మిగతా భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సంచలన కలెక్షన్స్ తో సత్తా చాటింది. రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఒక్క కర్ణాటకలోనే రూ.168.50 కోట్ల గ్రాస్ రాబట్టిన 'కాంతార'.. తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల గ్రాస్, తమిళనాడులో రూ.12.70 కోట్ల గ్రాస్, కేరళలో రూ.19.20 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.44.50 కోట్ల గ్రాస్, నార్త్ ఇండియాలో రూ.96 కోట్ల గ్రాస్ తో సత్తా చాటినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.400.90 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. ఇప్పటికీ పలు చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'కాంతార' ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



