వంద కొట్టిన పద్మావత్
on Jan 28, 2018

విడుదలకు ముందు ఎన్నో వివాదాలు.. అవరోధాలు.. అడ్డంకులు.. సుప్రీంకోర్టు మెట్లెక్కితే గానీ విడుదలకు నోచుకోలేదు పద్మావత్. అలాంటి సినిమా ఇప్పుడు రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్కుని చేరుకోని.. మరిన్ని వసూళ్లు రాబట్టే దిశగా దూసుకెళ్తోంది. సంజయ్ లీలా భన్సాలీ టేకింగ్. దీపిక పదుకొణే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ల నటన సినిమాను ఒక మెట్టుపైన నిలిపింది. తమ రాణి చరిత్రను వక్రీకరించి ఈ సినిమాను చిత్రీకరించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణీసేన కార్యకర్తలు అడుగడుగునా సినిమా విడుదలను అడ్డుకుంటూను ఉన్నారు. రిలీజ్‌కు ఒక రోజు ముందు కూడా గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ ఆందోళనలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. కానీ అక్కడక్కడా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వివాదాలకు దూరంగా భన్సాలీ పద్మావత్‌ను చక్కగా తెరకెక్కించారని విమర్శకులు పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



