భారతీయుడు -2 మొదలైందొచ్
on Jan 28, 2018
తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు.. దేశంలో అవినీతి వల్ల జరుగుతున్న అన్యాయాలపై మరోసారి పోరాటానికి దిగే భారతీయుడు అప్పట్లో సంచలనం సృష్టించింది. శంకర్ టేకింగ్, కమల్ నట విశ్వరూపం ఈ సినిమాను బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీయాలని కమల్-శంకర్ భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
అయితే ఇన్నాళ్ల తర్వాత అది సాకారం కాబోతోంది. తొలి భాగం చివర్లో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు మళ్లీ తన దేశానికి నా అవసరం ఉన్నప్పుడు తిరిగి వస్తానంటూ మాట ఇస్తాడు. అదే లైన్ తీసుకొని సీక్వెల్‌ను రూపొందించించడానికి ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ప్రస్తుతం 2.0 షూటింగ్లో శంకర్ బిజీగా ఉండటంతో అది పూర్తయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారట. తమిళంలో ఇండియన్-2గా, తెలుగులో భారతీయుడు-2గా, హిందీలో హిందుస్థానీ-2గా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించి తైవాన్‌లో తమిళ, హిందీ భాషల్లో ఇండియన్-2 అని రాసి ఉన్న హీలియం బెలూన్ను దర్శకుడు శంకర్ ఎగురవేశారు.