ఫస్ట్ రామ్‌చరణ్.. తర్వాతే అల్లు అర్జున్ : మైత్రి మూవీ మేకర్స్!
on Oct 18, 2025

2018లో రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సుకుమార్ చేసిన ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘పుష్ప2’ రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో అంతకు ముందు వున్న రికార్డులను క్రాస్ చేసేసింది. ఇలా వరస విజయాలతో దూసుకెళ్తున్న సుకుమార్ నెక్స్‌ట్ సినిమా ఏమిటి? అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. త్వరలోనే ‘పుష్ప3’ ఉంటుందని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన ‘డ్యూడ్’ చిత్రం పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్‌మీట్‌లో ‘పుష్ప3’ ఎప్పుడు ఉంటుంది అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు నవీన్ ఎర్నేని సమాధానమిస్తూ ‘మా బేనర్‌లో ఫస్ట్ రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే ఏప్రిల్, మే నెలల్లో చరణ్, సుకుమార్ సినిమా స్టార్ట్ అవుతుంది’ అని వివరించారు. సో.. దీన్నిబట్టి ఇప్పట్లో ‘పుష్ప3’ ఉండకపోవచ్చని చెప్పకనే చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



