ఎన్టీఆర్ కు సుకుమార్ బర్త్ డే గిఫ్ట్...!
on May 20, 2016

పుట్టిన రోజున చాలా గిఫ్ట్ లు వస్తాయి. అదే సినీ స్టార్స్ బర్త్ డే అయితే లెక్కే ఉండదు. అవి కూడా చాలా విలువైనవే అయి ఉంటాయి. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా, ఎన్టీఆర్ కు కూడా చాలా గిఫ్ట్ లే వచ్చాయి. అయితే వాటన్నింటిలో విలువైంది ఏదో తెలుసా..దాన్ని లెక్కల మాస్టారు తారక్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. కాకపోతే అందరు లెక్కల మాస్టర్లు స్కూల్స్ లో పనిచేస్తారు. ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వర్క్ చేస్తాడు. ఈపాటికే ఆయనెవరో మీకు అర్ధమై ఉంటుందిగా. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ కు మంచి హిట్ ను గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, ఆ సినిమా థీమ్ తో ఒక గిఫ్ట్ ను ఎన్టీఆర్ కు పంపించాడు. సినిమాలో చాలా కీలకమైన బటర్ ఫ్లై బొమ్మలు, ఫాలో ఫాలో అన్న పదాలు, టు డాడ్ విత్ లవ్ అన్న ఒక లైన్ ను క్లియర్ గా గడియారంలో రాయించి తారక్ కు మంచి గిఫ్ట్ ఇచ్చాడు సుకుమార్. క్లాక్ కు కింది భాగంలో రెండు బంతుల్ని పెట్టి గేమ్ఓవర్ అని రాయించాడు. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం నాన్నక ప్రేమతో సినిమా కథను ఆ వాల్ క్లాక్ లో పొందుపరిచాడు మన లెక్కల మాస్టారు. ఆ గిఫ్ట్ చూస్తే, సుక్కును మెచ్చుకోకుండా ఉండలేం. ఈ గిఫ్ట్ కు రిప్లై గా, నా పుట్టిన రోజుకు నేను అందుకున్న గిఫ్ట్స్ లో బెస్ట్ ఇదే అని ట్వీట్ చేశాడు తారక్. ఆ గిఫ్ట్ వెనుక ఉన్న బ్రిలియన్స్ అలాంటిది మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



