
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురిగా సినీరంగప్రవేశం చేసింది మంచు లక్ష్మి. అయితే విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన నటనతో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగింది. బుల్లితెర హోస్ట్ గా, సినిమాల్లో హీరోయిన్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె సినిమాలో ఉందంటే, ఏదో వెరైటీ పాత్ర అయ్యింటుంది అని ఆడియన్స్ ఫిక్సయ్యేలా తన సినిమాలను ఎంచుకుంటోంది. ఇలాంటి కోవలోకే వస్తుంది మంచు లక్ష్మి లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్. వినడానికే చాలా ఆసక్తి కలిగిస్తున్నఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ జడ్జి పాత్రలో లక్ష్మి కనిపించనుందట. దీపావళిలో లక్ష్మీ బాంబ్ ఎంత శక్తివంతమైందో, సినిమాలో తన పాత్ర కూడా అంతే శక్తివంతమైంది అంటూ చెప్పుకొస్తోంది మంచువారమ్మాయి. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటోంది. లక్ష్మీబాంబ్ ఫ్రం శివకాశి..టైటిల్ ఎరైటీగా ఉందికదండీ..






