'చరణ్'ని 'పానీపూరి'తో పోల్చిన తారక్
on Jan 5, 2022

'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా ప్రకటన రాకముందు మూవీ టీమ్ ప్రమోషన్స్ తో హోరెత్తించిన సంగతి తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడిపారు. అయితే కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. దీంతో ప్రమోషన్స్ కి కూడా బ్రేక్ పడింది. అయితే విడుదల వాయిదా ప్రకటన రాకముందు తారక్ పాల్గొన్న ప్రమోషనల్ వీడియో ఒకటి తాజాగా విడుదలైంది. ఈ వీడియోలో తారక్.. రాజమౌళిని బిర్యానీతో, చరణ్ ని పానీపూరితో పోల్చాడు.

'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటి సాహెబా బాలీ హైదరాబాద్ లో తారక్ ని సరదాగా ఫుడ్ బేస్డ్ ఇంటర్వ్యూ చేసింది. తారక్ యాక్టింగ్, డాన్స్ లోనే కాకుండా కుకింగ్ లోనూ దిట్ట అని తెలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాహెబాను గెస్ట్ గా భావించిన తారక్.. ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్ వడ్డించాడు. ఆ సమయంలో సాహెబా.. ఆర్ఆర్ఆర్ లో రియల్ టైగర్ తో యంగ్ టైగర్ ఫైట్ చేశారా? అని అడగగా.. 'ఏమో.. చేసుండొచ్చు, చేయకపోవచ్చు' అంటూ తారక్ స్పష్టంగా సమాధానం చెప్పకుండా దాటవేశాడు.
ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఏయే వంటకాలతో పోలుస్తారని సాహెబా అడగగా.. తారక్ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. "బిర్యానీ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ తయారు చేయాలంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. రాజమౌళి కూడా అంతే. చూడటానికి సింపుల్ ఉంటారు కానీ పని విషయంలో పర్‌ఫెక్ట్." అంటూ రాజమౌళిని బిర్యానీతో పోల్చాడు తారక్.

ఇక చరణ్ ని పానీపూరితో పోల్చాడు తారక్. "పానీపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్ బయపడతాయి. చరణ్ కూడా అంతే.. తనతో మాట కలిపితే చాలు అన్ని విషయాలూ షేర్ చేసుకుంటాడు." అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.
"ఆలియా భట్ ఇరానీ బన్ మస్కా లాంటిది. ఎందుకంటే ఇరానీ బన్ మస్కా ఎంతో ఆరోగ్యకరమైంది. చాలా ప్రత్యేకమైంది." అని చెప్పిన తారక్.. అజయ్ దేవ్‌గణ్ ని వడా పావ్ తో పోల్చాడు. "ముంబయి లోకల్ ఫుడ్ అయిన వడా పావ్ అక్కడివారికి కచ్చితంగా ఉండాల్సిందే. అజయ్ దేవ్‌గణ్ కూడా వడా పావ్ లా అందరికీ కావాల్సిన వ్యక్తి" అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ని తారక్ ఫుడ్ ఐటమ్స్ తో పోల్చి చెప్పిన తీరు ఆకట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



