కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ
on Jan 5, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వార్ రోజురోజుకూ ముదిరిపోతోంది. సినిమా టికెట్ల రేటు నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. వర్మకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. దాంతో మరింత రెచ్చిపోయిన ఆర్జీవీ మరిన్ని వరుస ట్వీట్లతో ఏపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ ట్వీట్లకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మను అస్సలు పట్టించుకోవాల్సి అవసరమే లేదన్నారు. వేరే రాష్ట్రంలో ఉండి రామ్ గోపాల్ వర్మ ఏపీ గురించి ఏదేదో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలోనే, ఇతర దేశాల్లో ఉండే వాళ్లను తాము అసలు పట్టించుకోబోమన్నారు.
సంబంధంలోని విషయాల్లో కూడా కల్పించుకునే ఆర్జీవీ.. తన గురించి మాట్లాడితే ఊరుకుంటారా? తనదైన స్టైల్లో కొడాలి నానికి కౌంటర్ వేశారు. "ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి జవాబు చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. వాళ్లు చెబుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే" అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



