బజ్: తారక్, విజయ్ మల్టిస్టారర్
on Apr 19, 2021
ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్` చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు తారక్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ బడా మల్టిస్టారర్.. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న థియేటర్స్ లోకి రానుంది. ఆ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో `ఎన్టీఆర్ 30` చేయబోతున్నారు. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది. ఆపై `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తోనూ, `ఉప్పెన` ఫేమ్ బుచ్చి బాబు సానాతోనూ తారక్ నెక్స్ట్ వెంచర్స్ ఉంటాయని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. చాలాకాలంగా వార్తల్లో ఉన్న తారక్ - అట్లీ కాంబినేషన్ కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని.. ఇదో మల్టిస్టారర్ గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.