`అఖండ`కి `హాట్` డీల్
on Apr 19, 2021

నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. తెలుగు రాష్ట్రాల్లో ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. వీరి కాంబోలో ఓ సినిమా వస్తోందంటే.. బ్లాక్ బస్టర్ ఖాయమన్న నమ్మకం అటు నందమూరి అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ బలంగా నాటుకుంది. ఈ నేపథ్యంలోనే.. `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య, బోయపాటి జట్టుకట్టిన `అఖండ`పై స్కై-హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి తగ్గట్టే.. `అఖండ` ఫస్ట్ రోర్ (బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు), టైటిల్ రోర్ (ఉగాది పర్వదినం సందర్భంగా విడుదలైంది) అభిమానుల్లో పూనకాలు తెచ్చాయి. గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చాయి. సగటు ప్రేక్షకుల్లోనూ మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నామనే నమ్మకం కలిగించాయి.
ఈ క్రమంలోనే.. మాస్ లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని బజ్. `అఖండ` శాటిలైట్ రైట్స్ ని `స్టార్ మా` హయ్యస్ట్ ప్రైజ్ తో కొనుగోలు చేయగా.. ఓటీటీ రైట్స్ ని `హాట్ స్టార్` రికార్డ్ స్థాయి మొత్తంతో ఓన్ చేసుకుందట. మొత్తంగా.. `అఖండ`కి `హాట్` డీల్ కుదిరిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
`అఖండ`లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



