జక్కన్నతో కలిసి జపాన్ పయనమైన తారక్, చరణ్!
on Oct 18, 2022

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకున్న 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు జపాన్ లో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం జపాన్ లో అక్టోబర్ 21న భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ పయనమయ్యారు.
జపాన్ కి పయనమైన రాజమౌళి, తారక్, చరణ్ ల ఎయిర్ పోర్ట్ లోని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తారక్, చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. చరణ్ అడపాదడపా సినిమా వేడుకల్లో కనిపిస్తూనే ఉన్నాడు. కానీ తారక్ ఈ మధ్య ఎక్కువగా కెమెరా కంట పడలేదు. మొన్నటివరకు మీసాలు గడ్డంతో ఉన్న తారక్ ఇప్పుడు ట్రిమ్ చేసి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కొరటాలతో తాను చేయబోతున్న సినిమా కోసం తన లుక్ ని మార్చుకుంటున్నట్టున్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్ ఎప్పటిలాగే స్టైలిష్ గా మెరిసిపోతున్నాడు.
జపాన్ తో పాటు చైనా వంటి దేశాల్లోనూ 'ఆర్ఆర్ఆర్'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ఈ చిత్రం రూ.1500 కోట్ల గ్రాస్ మార్క్ ని సులభంగా అందుకునే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



