1163 మందిని నేను ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం చేసాను
on Oct 18, 2022

దర్శకుడు తేజ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. స్వచ్చమైన ప్రేమకథలు, సెన్సిబుల్ ఇష్యూస్ తో మూవీస్ తీసి హిట్ కొడుతూ వుంటారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ గా తేజను చెప్పుకోవచ్చు. తేజ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఇప్పుడు తెలుగులో `అహింస` పేరుతో మూవీ చేస్తున్నారు డైరెక్టర్ తేజ. దీని ద్వారా ప్రొడ్యూసర్ సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. "ఐతే ఇండస్ట్రీ అంటే తెలియని ఒక 10 వేల మందిని పరిచయం చేయాలని అనుకుంటున్నా అని జీ కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ లో చెప్పారు. ఐతే అంతమందిని పరిచయం చేసేలోపు నేను ఉంటానో పోతానో కూడా తెలీదే "అన్నారు.
ఇక ఈ షోలో అహింస మూవీకి సంబంధించిన టీజర్ ప్లే చేశారు. తర్వాత ఇంటిగుట్టు సీరియల్ లో నటించినందుకు సూర్య - అనుపమకు తేజ అవార్డ్స్ అందించారు. తర్వాత డాన్స్ ఇండియా డాన్స్ టీమ్ మెంబెర్స్ అందరూ వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ గా సద్దాంకి అవార్డు అందించారు. ఇక ఈ షో బింబిసారా మూవీ డైరెక్టర్ తో మూవీ సక్సెస్ ఐనందుకు పెద్ద కేక్ ని కట్ చేయించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



