వేధించిన నందు.. సినిమా ప్రమోషన్స్‌కి రాను అని భీష్మించిన రష్మీ!
on Oct 18, 2022

యాంకర్ రష్మీ బుల్లితెర మీదే కాదు వెండి తెర మీద కూడా ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే రకరకాల షోస్ తో బిజీబిజీగా గడుపుతున్న ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక లేటెస్ట్ గా ఆమె నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బాస్టర్’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 4న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ విడుదల సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ బాగా చేస్తోంది.
ఇలాంటి టైంలో రష్మీ ఈ మూవీ హీరో ఐన నందు మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నందు యూట్యూబ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో నందు మాట్లాడుతూ.. ‘‘నేను యూట్యూబ్‌కు వచ్చి మీ అందరితో మాట్లాడటానికి కారణం యాంకర్ రష్మీ. ఆమె వల్ల మేము చాలా సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం. రష్మీ మా సినిమా ప్రమోషన్లకు రావట్లేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. రష్మీ ఇక్కడే షూటింగ్ చేస్తోందని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాం. తను ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదు అని కనుక్కోవటానికి వచ్చాం’’ అని అన్నాడు.

నందు, కిరీటి, మరో వ్యక్తి కలిసి రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లేస్‌కి వెళ్లి అక్కడ మేకప్ అవుతున్న రష్మీని ఈ విషయమై నిలదీశారు. దీంతో రష్మీ, ‘‘మీరు నన్ను వేధిస్తున్నారా?.. నాకు వేరే షూట్ ఉంది.. నేను మీ సినిమాని ప్రమోట్ చేయను’’ అని తేల్చి చెప్పేసింది రష్మీ. అయినా వాళ్లు వినలేదు. ఆమెను ఒప్పించారు. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఫుల్ జోష్ తో మూవీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసింది. ఇదంతా ప్రమోషన్స్ లో ఒక భాగం అని, ఆ ప్రమోషన్ ని కూడా వెరైటీగా ప్లాన్ చేశారని అర్థమౌతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



