'ఎన్టీఆర్ 30' రిలీజ్ డేట్ ఫిక్స్!
on Nov 10, 2022

'ఎన్టీఆర్ 30' ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా మొదలే కాలేదు గానీ అప్పుడే విడుదల తేదీ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2023 దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మూవీ టీమ్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' వచ్చి ఏడు నెలలు దాటినా ఇంతవరకు 'ఎన్టీఆర్ 30' షూటింగ్ మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారట. దసరా టార్గెట్ గా ఈ చిత్ర షూటింగ్ మొత్తాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
2023 దసరా అక్టోబర్ 24(మంగళవారం) వస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 20న(శుక్రవారం) విడుదలైతే ఐదు రోజుల లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు, లాంగ్ వీకెండ్ కలిసొస్తే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇంత కాలం ఆలస్యమైనందుకు పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



