నాగ శౌర్యకు కాబోయే భార్యది ఎన్టీఆర్ అమ్మమ్మ గారి ఊరే!
on Nov 10, 2022

యువ హీరో నాగ శౌర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న అనూష అనే యువతితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఆ యువతిది జూనియర్ ఎన్టీఆర్ అమ్మమ్మ గారి ఊరు కావడం విశేషం.
ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకు చెందిన వారు. మంగళూరు దగ్గరలోని కుందాపూర్ ఆమె పుట్టిన ఊరు. అంటే అది తారక్ అమ్మమ్మ గారి ఊరు అవుతుంది. ఇప్పుడు శౌర్య పెళ్ళాడుతున్న అనూషది కూడా అదే ఊరట. ఆమె పూర్తి పేరు అనూష శెట్టి. బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న ఆమె ఆ రంగంలో పలు అవార్డులను సైతం గెలుచుకున్నట్టు తెలుస్తోంది.
శౌర్య-అనూషల వివాహం నెల 20న బెంగళూర్ లో జరగనుంది. ఆదివారం ఉదయం 11:25కి పెళ్లి ముహూర్తం. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



