2023లోనూ బన్నీ సినిమా లేనట్లే!
on Nov 16, 2022

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ 2021 డిసెంబర్‌లో రిలీజయ్యింది. అది పాన్ ఇండియా హిట్ కావడంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ మూవీ తర్వాత వేరే ఏ సినిమా ఒప్పుకోకుండా దాని సీక్వెల్ 'పుష్ప: ద రూల్' చేయడానికి సిద్ధమైపోయాడు. 'పుష్ప ' రిలీజ్ అయ్యి ఇప్పటికి సరిగ్గా 11 నెలలు గడిచాయి. అయితే ఇంతదాకా దాని షూటింగ్ పట్టాలెక్కలేదు. దాంతో బన్నీకి 2022 ఖాళీగా గడిచిపోయింది.
నిజానికి ఆరు నెలల క్రితమే ఈ మూవీ షూట్ బిగిన్ అవుతుందని ప్రచారంలోకి వచ్చింది. కానీ 'పుష్ప' బ్లాక్‌బస్టర్ అయిన తీరుతో డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో మరింత శ్రద్ధ చూపించాలని నిశ్చయించుకున్నాడు. దాని కారణంగా షూటింగ్‌కు జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల సినిమాటోగ్రాఫర్ మిరొస్లావ్ క్యూబా బ్రోజెక్ షేర్ చేసిన అల్లు అర్జున్ ఫొటో షూట్‌తో షూటింగ్ మొదలవబోతున్నదనే సంకేతాలు వచ్చాయి. నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే షూట్ మొదలవుతుందన్నారు. కానీ ఇంత దాకా ఆ ఊసే లేదు.
లేటెస్ట్‌గా వినవస్తున్న దాని ప్రకారం 'పుష్ప 2' షూట్ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ఇక షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో మాత్రం టీం మెంబర్స్‌కు ఎవరికీ క్లారిటీ లేదని తెలుస్తోంది. సుకుమార్ సంగతి తెలిసినవాళ్లు 2023లో 'పుష్ప 2' రిలీజ్ అయ్యే అవకాశం లేదనీ, 2024 వేసవికి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందనీ అభిప్రాయపడుతున్నారు.
'పుష్ప'కు అయిన బడ్జెట్‌తో పోలిస్తే, 'పుష్ప 2'కు రెట్టింపు బడ్జెట్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కేటాయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 'పుష్ప 2'పై విపరీతమైన క్రేజ్ రావడంతో బిజినెస్ కూడా ఆ రేంజ్‌లోనే జరుగుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మొత్తానికి 2022తో పాటు 2023లోనూ బన్నీ సినిమా ఉండదనేని ఖాయమని తెలుస్తోంది. 2024 సమ్మర్‌కు 'పుష్ప 2' వస్తే.. రెండు సినిమాల మధ్య దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ వచ్చినట్లవుతుంది. ఇది బన్నీ ఫ్యాన్స్‌ను నిరుత్సాహానికి గురిచేసే విషయమే.
'పుష్ప 2' క్యాస్టింగ్ విషయానికి వస్తే శ్రీవల్లి పాత్రను రష్మికా మందన్న నిలుపుకోగా, ఒరిజినల్‌లో చేసిన క్యారక్టర్లనే ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, జగదీష్ ప్రతాప్, అనసూయ, శత్రు, మైమ్ గోపి చేయబోతున్నారు. వారితో పాటు ఒరిజినల్‌లో లేని ఆర్టిస్టులు కొంతమంది సీక్వెల్‌లో నటించనున్నారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



