తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా?
on Nov 16, 2022

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారా? అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా? ఈ విషయం గురించి మిల్కీబ్యూటీ ఏమన్నారు? ఇంతకీ ఆమె వివాహవార్తలను ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? ఇలాంటి విషయాలన్నిటి మీదా స్పందించారు తమన్నా. నేను పెళ్లి చేసుకోబోయే బిజినెస్ మేన్ ఇతనే అంటూ తన ఇన్ స్టా స్టోరీస్‌లో ఓ వీడియో షేర్ చేశారు తమన్నా. అందులో తమన్నా అబ్బాయి వేషంలో ఉన్న వీడియో ఉంది. రీసెంట్‌గా విడుదలైన ఎఫ్3లో తమన్నా అబ్బాయి వేషంలో కనిపించారు. ఆ వీడియోనే ఇప్పుడు షేర్ చేశారు. ఇంతకీ తమన్నా అంత తమాషాగా ఎందుకు స్పందించారని అనుకుంటున్నారా? ఆమె త్వరలోనే ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికే తమన్నా ఇలా స్పందించారు.
నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ కేప్షన్ రాయడంతో పాటు, మేరేజ్ రూమర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించారు. ఎవరు పడితే వారు తన జీవితాన్ని గురించి రాసేస్తున్నారంటూ అసహనం కూడా వ్యకర్తం చేశారు తమన్నా. గతంలోనూ తమన్నా పెళ్లి గురించి ఇలాంటి వార్తలొచ్చాయి. అయితే తన పెళ్లి బాధ్యతలను తాను పూర్తి తల్లిదండ్రులకు అప్పజెప్పానని అన్నారు తమన్నా. ఆమె ప్రస్తుతం చిరంజీవి సరసన భోళాశంకర్‌లో నటిస్తున్నారు. తమిళ సినిమా వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతోంది భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు కీర్తీసురేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



