'వీర సింహా రెడ్డి'.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!
on Nov 16, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'వీర సింహా రెడ్డి'. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉన్నట్టు తెలుస్తోంది.
బాలయ్య సినిమా అంటే భారీ ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆయన గత చిత్రం 'అఖండ'లో డివోషనల్ టచ్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. అందుకే ఆ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ని బాగా మెప్పించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 'వీర సింహా రెడ్డి'లోనూ అదే రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.
'వీర సింహా రెడ్డి'లో చిన్న, పెద్ద కలిపి మొత్తం 11 ఫైట్లు ఉంటాయట. అందులో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయని.. ఇక సెకండాఫ్ లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. మొత్తం 11 ఫైట్లలో ఐదు మేజర్ ఫైట్స్ కాగా, మిగతావి చిన్న ఫైట్స్ అని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన 'వీర సింహా రెడ్డి' పోస్టర్స్, ఫస్ట్ హంట్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను తర్వాత బాలయ్యను అంత పవర్ ఫుల్ గా చూపించిన డైరెక్టర్ మలినేనే అంటూ ఫ్యాన్స్ టీజర్ చూసే సంబరపడుతున్నారు. మరి సినిమా కూడా అదేస్థాయిలో ఉండి బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



