క్రేజీ కాంబినేషన్ బాగా క్యాష్ చేసుకుంటున్నారు!
on Feb 9, 2023
.webp)
తెలుగులో కథకు మించి క్రేజీ కాంబినేషన్ లకు పెద్దపీట వేస్తారు. క్రేజీ కాంబినేషన్లను సెట్ చేస్తే సినిమా ఫలితం పై పెద్దగా నిర్మాతలు దిగులు పడాల్సిన పనిలేదు. ఆ క్రేజీ కాంబినేషన్ వల్లనే ఆయా చిత్రాల మార్కెటింగ్ జరిగిపోతుంది. పెట్టిన పెట్టుబడికి తోడు లాభాలు కూడా విడుదలకు ముందే వచ్చేస్తాయి. ఇక పవన్తో త్రివిక్రమ్ తీసిన సినిమాలను హారిక అండ్ హాసిని బ్యానర్ ఇలాగే బాగా క్యాష్ చేసుకుంది. తాజాగా మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కాంబినేషన్ను కూడా ఈ సంస్థ బాగా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇలా క్రేజీ కాంబినేషన్లో నమ్ముకోవడం కంటే అమ్ముకోవడం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తాజాగా మహేష్- త్రివిక్రమ సినిమా నైజాం హక్కులని 50 కోట్లకు అమ్మేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సెట్స్ లో ఉండగానే డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా ఈ రేంజిలో ఈ సినిమాకు రేటు పలికింది. మహేష్ ముందు సినిమాలేవి నైజాంలో ఈ రేంజి వసూళ్లు దక్కించుకోలేకపోయాయి. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలు 30 నుంచి 40 కోట్లు టచ్ చేయలేదు. మరి అలాంటప్పుడు 50 కోట్లకు ఎలా అమ్మారు? అనేది ఆసక్తి కరం. హారిక వారు అలా వైకుంఠపురంలో సినిమాను చూపించి బిజినెస్ చేశారట. ఏమాత్రం తేడా వచ్చినా మహేష్ కు పరువు పోతుంది. నైజం లో ఇంతవరకు మహేష్ సినిమా 30 కోట్లనే టచ్ చేయలేదు.
అక్కడ 40 కోట్ల దాటిన సినిమాలుగా బాహుబలి 1, బాహుబలి 2, అలా వైకుంఠపురంలో, ఆర్ఆర్ఆర్ చిత్రాలు నిలిచాయి. రీసెంట్ గా విడుదలైన వాల్తేరు వీరయ్య 35 కోట్ల మార్పుని చేరబోతోంది. అలాంటప్పుడు త్రివిక్రమ్- మహేష్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిన 40 కోట్ల మార్కును టచ్ చేయడం అంత సులువేమీ కాదు. మరి అన్ని తెలిసి కూడా 50 కోట్లకు ఈ సినిమా నైజాం రైట్స్ అని ఎలా అమ్మారు? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మహేష్- త్రివిక్రమ్‌కాంబినేషన్ చూపి ఈ ధరకు అమ్ముకున్నారని అంటున్నారు. నైజాంలో 50 కి అమ్మారు అంటే ఆంధ్రాలో మరో 5, 10 కోట్లు ఎక్కువగా అమ్ముతారు. రాజమౌళి సినిమా ఉందన్న నమ్మకం... మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వంటివి మార్కెట్ స్థాయికి మించి హారిక అండ్ హాసిని వర్గాలు ఈ మూవీని ఆ రేటుకు అమ్మడానికి కారణాలుగా అర్ధమవుతోంది. మరి కొనే వారైనా ఆ స్థాయి రేటుకి ఎలా మొగ్గుచూపారు? అనేది ప్రశ్నార్ధకంగామారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



