నివేదా రిక్రియేట్ చేసిన "జై బాలయ్య" షర్ట్ డాన్స్.. వీడియో వైరల్!
on Dec 30, 2021

'అఖండ' మూవీతో నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీ తాము ఊహించిన దానికి మించి హిట్టవడంతో చాలా రోజులుగా వాళ్లు పండగ మూడ్‌లోనే ఉంటున్నారు. ఇక ఆ సినిమాలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటపై చిత్రీకరించిన "జై బాలయ్య" సాంగ్‌కు వచ్చిన పాపులారిటీ ఎలాంటిదో తెలిసిందే. అందులో బాలయ్య వేసిన 'షర్ట్ డాన్స్' ఒకటి ఇప్పుడు సిగ్నేచర్ స్టెప్‌గా మారిపోయింది. లేటెస్ట్‌గా యంగ్ హీరోయిన్ నివేదా థామస్ సైతం "జై బాలయ్య" సాంగ్ ఫ్యాన్స్‌లో ఒకరిగా మారిపోయినట్లు తెలుస్తోంది. తెరపై ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో అలరించే ఆమె నిజ జీవితంలో చాలా సరదా అమ్మాయి. పలు రకాల ఫన్నీ వీడియోస్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తూ ఫాలోయర్స్‌ను అలరిస్తుంటుంది.
Also read: సమంతని ఇమిటేట్ చేస్తున్న అషురెడ్డి!
లేటెస్ట్‌గా బాలయ్య ఫ్యాన్స్‌ను మరింత ఆనందపరుస్తూ, "జై బాలయ్య" సాంగ్‌కు తను వేసిన స్టెప్స్‌తో ఒక వీడియో చేసిందామె. ప్రధానంగా బాలకృష్ణను అనుకరిస్తూ ఆ పాటలోని సిగ్నేచర్ స్టెప్‌ను ఆమె వేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఒరిజినల్ సాంగ్‌లో బాలయ్య స్టెప్ వేస్తుంటే, ఆయన ఒంటి మీద నుంచి ఒక్కో షర్ట్ వచ్చేస్తుంటుంది. ఆ తరహాలోనే నివేదా 3 షర్ట్స్‌ను ధరించింది. వాటి కొసలను దారంతో ముడివేసి ఆమె బ్రదర్ పట్టుకొని ఉంటే, ఫస్ట్ ఒక స్టెప్ వేయడంతో ఒక షర్టుకు బదులు రెండు షర్టులు ఒకేసారి ఊడి వచ్చేశాయి. ఆ తర్వాత మూడో షర్టు వచ్చేసింది. ఆమె స్టెప్ వేసి ముందుకు వెళ్తుంటే, ఆమె బద్రర్ కూడా నవ్వుతూ ఆమె వెనకే వెళ్తూ కనిపించాడు.
Also read: సమంతా.. నువ్వు నా హృదయాన్ని గెలిచావ్! బన్నీ మాటకు సామ్ రెస్పాన్స్ ఇదే!!
ఈ వీడియోను షేర్ చేసిన నివేదా, "ఇది సరదాగా ఉండాల్సిన సీజన్. అఖండ చవిచూసిన అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను." అంటూ రాసుకొచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఈ ఫన్నీ వీడియో 5 లక్షలకు పైగా లైక్స్ పొందడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



