2021 జ్ఞాపకాలుః డబ్బింగ్ హిట్స్!
on Dec 29, 2021

2021 క్యాలెండర్ ఇయర్‌లో 50కి పైగా డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. థియేటర్స్, ఓటీటీ.. వేదిక ఏదైనా ప్రజాదరణ పొందిన చిత్రాలు మాత్రం స్వల్పమనే చెప్పాలి. జనం మెచ్చిన ఆ డబ్బింగ్ సినిమాల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ `మాస్టర్`.. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళు చూసింది. విజయ్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం యాక్షన్ ప్రియులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక ఏప్రిల్ 2న విడుదలైన కార్తి - రష్మిక స్టారర్ `సుల్తాన్` యావరేజ్ గా నిలవగా.. దానికంటే ఒక్క రోజు ముందు విడుదలైన శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మూవీ `యువరత్న` ఓ వర్గం ప్రేక్షకుల ఆదరణ పొందింది.
అలాగే శివ కార్తికేయన్ నటించిన తమిళ అనువాద చిత్రం `వరుణ్ డాక్టర్` కూడా అక్టోబర్ నెలలో సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. అదేవిధంగా హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ లో `గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్`, `స్పైడర్ మ్యాన్ః నో వే హోమ్` కూడా సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇక ఓటీటీ సినిమాల విషయానికి వస్తే.. సూర్య నటించిన కోలీవుడ్ కోర్ట్ డ్రామా `జై భీమ్` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి తెలుగు వీక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న టొవినో థామస్ స్టారర్ మాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్ `మిన్నల్ మురళి` కూడా అనువాద రూపంలో బాగానే అలరిస్తోంది.
ఓవరాల్ గా.. భాషతో సంబంధం లేకుండా కొన్ని డబ్బింగ్ సినిమాలు ఈ క్యాలెండర్ ఇయర్ లో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



