అమల గారు చేస్తేనే ఈ సినిమా చేస్తానని చెప్పాను!
on Dec 30, 2021

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలతో అలరిస్తుంటాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం'. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను లాంఛ్ చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ లాంఛ్ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల గారు నటించకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదని అన్నాడు.
శర్వానంద్ మాట్లాడుతూ.. " ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమె మా వెనకాల ఉండి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా సినిమా అని లైఫ్ లాంగ్ చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. ఆయనకు నివాళిగా ఒక ఈవెంట్ జరిపి ఈ పాటను రిలీజ్ చేస్తాం. కుదిరితే శాస్త్రి గారి అమ్మగారిని, అమల గారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం." అన్నారు.
"ఈ స్టోరీ చెప్పగానే అమల గారు సినిమా చేస్తున్నారా అని అడిగాను. ఆమె చేస్తేనే చేస్తానని చెప్పాను. కార్తీక్ స్టోరీ నేరేట్ చేసేటప్పుడే ఈ పాత్రకి అమల గారినే అనుకొని చెప్పాడు. దాంతో నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమల గారి పాత్ర." అని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



