నివేద.. సంక్రాంతి సెంటిమెంట్
on Jan 5, 2021

మెంటల్ మదిలో (2017) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నివేదా పెతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆపై చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో సందడి చేసింది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో మూవీలో కీలక పాత్రలో సందడి చేసింది.
కట్ చేస్తే.. సరిగ్గా ఏడాది తరువాత ఇప్పుడు తన ఐదో తెలుగు చిత్రం రెడ్ తో పలకరించబోతోంది నివేదా. కోలీవుడ్ హిట్ తాడమ్ ఆధారంగా రూపొందిన రెడ్ లో పోలీసాఫీసర్ రోల్ లో దర్శనమివ్వనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నిరుడు సంక్రాంతికి అల వైకుంఠపురములో రిలీజైతే.. ఈ ఏడాది ముగ్గుల పండక్కి రెడ్ వస్తోంది. సో.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కోసం సంక్రాంతి సీజన్ లోనే పలకరిస్తున్న నివేదాకి సెంటిమెంట్ రిపీట్ అయి మరో పొంగల్ హిట్ దక్కుతుందేమో చూడాలి. ఈ నెల 14న రెడ్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వంలో నివేదా అతిథి పాత్రలో నటించింది. వేసవిలో ఈ సినిమా తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



