నయన్-విఘ్నేశ్ పెళ్లాడేది అప్పుడేనా?
on Jan 5, 2021

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ టాక్ ఆఫ్ ద టౌన్. ఐదేళ్ల నుంచీ ప్రేమలో ఉన్న వారిద్దరికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ హాట్ న్యూస్‌గా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. షూటింగ్‌లు లేని కాలంలో ఆ ఇద్దరూ వివిధ ప్రదేశాలకు షికార్లు చేయడానికి వెళ్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ, అభిమానులకు సంబరాన్ని కలిగిస్తున్నాడు. నయన్ ఎక్కడికి వెళ్తే అక్కడ వాలిపోతున్నాడు విఘ్నేశ్. ఆ ఇద్దరి రొమాంటిక్ పోజులు ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయనేది నిజం.
ఇటీవల బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్‌తో నయనతార క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. వాటిలో నయన్ సెక్సీ లుక్స్ ఫ్యాన్స్ మతులు పోగొట్టాయి. బ్లూ డ్రస్‌లో క్లీవేజ్ కనిపిస్తూ నయన్ ఇచ్చిన పోజు అయితే మరీ! ఆ పిక్చర్స్ ఇంటర్నెట్‌ను సునామీలా కమ్మేశాయి. ఐదేళ్లుగా ఈ జంట చెన్నైలో ఒకే ఇంట్లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో గడుపుతున్నారు. 2020లో వారు పెళ్లాడనున్నారని బాగా ప్రచారంలోకి వచ్చినా అది నిజం కాలేదు.
లేటెస్ట్‌గా మరోసారి నయన్-విఘ్నేశ్ పెళ్లి గురించిన ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ ఫిబ్రవరిలోనే వారు అధికారికంగా దంపతులుగా మారనున్నారనేది ఆ ప్రచార సారాంశం. నిరాడంబరంగా, పూర్తి ప్రైవేట్ వ్యవహారంగా ఈ వేడుక ఉంటుందని వినిపిస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమేరకు నిజముందనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానున్నది. కోలీవుడ్ వర్గాలైతే ఈ ఏడాది నయన్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని నమ్ముతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో...

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



